
జనం న్యూస్ చంటి మార్చి 22: దౌల్తాబాద్, గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని మండల బిజెపి పార్టీ అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి అన్నారు.మండలం ముత్యంపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి మెదక్ ఎంపీ రఘు నందన్ రావు సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం (ఎన్ ఆర్ ఇ జి ఎస్) నిధుల తో రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు శనివారం గ్రామ సర్పంచ్ సునీత స్వామి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత స్వామి మాట్లాడుతూ. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు లావణ్య నర్సింహా రెడ్డి మాట్లాడుతూ. ఎంపీ రఘు నందన్ రావు సహకారంతో గ్రామానికి అభివృద్ధి పనులు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్ణాకర్, కొనాయి పల్లి మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, శ్రీకాంత్. ప్రశాంత్. శేఖర్. యాదమ్మ. నవనీత. స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.