ఇందిరమ్మ ఇల్లు పేదల ఆనందం సొంతింటి కలలకు ప్రభుత్వం తోడు

* ప్రారంభోత్సవంలో ఉత్సాహ వాతావరణం.

జనం న్యూస్ మార్చ్ 22 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలంలోని పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆశలను నింపుతోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం వారికి భరోసాగా మారింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని మద్దిరమ్మ తల్లి గుడి సెంటర్ ప్రాంతంలో నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి అర్హుడికి ఈ పథకం అందేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఇంటి యజమానుల కుటుంబ సభ్యులు వైస్ చైర్మన్‌ను శాలువాతో సత్కరించారు. అలాగే యువ నాయకుడు జూపల్లి ప్రమోద్‌ను కూడా శాలువాతో సత్కరించి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు జూపల్లి ప్రమోద్, 3వ వార్డ్ కౌన్సిలర్ చిన్నంశెట్టి శ్రీను, 1వ వార్డ్ కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై కొత్త ఇంటి ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *