జనం న్యూస్ 22 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా: ఆసిఫాబాద్ టౌన్ రంజాన్ పండుగ సందర్భంగా ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మార్సుకోల సరస్వతి కూడా పాల్గొన్నారు. ఎండి అహ్మద్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, మున్సిపల్ చైర్మన్, నాయకురాలు మర్సకొల సరస్వతి, రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మిలను ఎండి అహ్మద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు అన్సర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కూడా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, నాయకులు సయ్యద్ నిసార్, అశోక్, సల్మాన్, రవి, సయ్యద్ జవిద్, పొన్నాల నారాయణ, సాయి శ్రావణ్, అర్ఫజ్ అలీ, పర్దీన్, మనీష్, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.