జనం న్యూస్ మార్చి 15 గంగారం మండలం మహబూబాద్ జిల్లా గంగారం మండలంలో ఎస్సై రవికుమార్ పిలుపుమేరకు తిరుమలగండి గ్రామ సర్పంచ్ కృష్ణారావు, మడగూడెం గ్రామ సర్పంచ్ సురేష్, బావురగొండ గ్రామ సర్పంచ్ వీరభద్ర పోతయ్య ల సహకారం తో ఆయా గ్రామాలలో సోలార్ సి.సి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ, ఇదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచ్ లు తమ గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలు నేరాలను చేధించడం లో ఎంతగానో ఉపయోగ పడతాయని, గ్రామానికి రక్షణగా నిఘా నేత్రాల వలె పని చేస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా షాపుల యజమానులు, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని తెలియజేశారు.