యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి :సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్,మార్చ్ 15 మసాయిపేట్ ప్రతినిధి మొహమ్మద్ ముజామిల్ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వ్యాపార రంగంలో ముందుకు రావాలనిదుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. చేగుంట లోని ఎస్ వి మైబైల్ షాప్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువత సృజనాత్మక ఆలోచనలతో స్వయం ఉపాధి రంగంలోకి అడుగుపెడితే ఆర్థికంగా స్వావలంబన సాధించడమే కాకుండా, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలరన్నారు. చేగుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు సమీపంలో అందుబాటులో ఉండే విధంగా 'ఎస్ వి మొబైల్ షాప్ ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. నాణ్యమైన మొబైల్స్ ను సరసమైన ధరల్లో అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని యజమానులకు సూచించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ సండ్రుగు సతీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగలరావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, సండ్రుగు శ్రీకాంత్,వార్డ్ మెంబెర్స్ లు తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.