వేసవిలో సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి గ్లూకోస్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేసిన టౌన్ ఇన్స్పెక్టర్

జనం న్యూస్ , మార్చి 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ వేసవికాలంలో విధులు నిర్వహించే సమయంలో పోలీసు సిబ్బంది డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ గౌడ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందికి మాస్కులు మరియు శరీరానికి తక్షణ శక్తి అందించే గ్లూకోస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ, వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బయట విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎక్కువగా నీరు తాగడం, గ్లూకోస్ వంటి ఎనర్జీ పదార్థాలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుంచి దూరంగా ఉండవచ్చని సూచించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.