వెదురుపాకలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజక వర్గం అంగర వెంకట్ మార్చి 15 రాయవరం మండలం, వెదురుపాక గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాయవరం మండల జన సేన అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, సోమేశ్వరం సొసైటీ ప్రెసిడెంట్ శాఖ కోటి, దేవిశెట్టి కోటేశ్వరరావు, నక్కరాజు రాజేష్ ,కొప్పిరెడ్డి తాతాజీ, వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు