వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్

జనం న్యూస్, మార్చ్ 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, హుజూరాబాద్ మరియు జమ్మికుంట మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.అదనంగా, ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *