జనంన్యూస్ మార్చి 15 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) వారసత్వ సంపదగా ప్రసిద్ధి చెందిన లేపాక్షిలో శనివారం వీరభద్ర అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీరభద్ర అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ (లేపాక్షి) మరియు శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ , అండ్ కల్చరల్ ట్రస్ట్ (గుమ్మయ్యగారిపల్లి) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బెంగళూరుకు చెందిన కళాకలవరం సంస్థ నృత్యకారులు పలు అంశాలపై నాట్య ప్రదర్శనలు ఇచ్చి సభికులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహాగణపతి భరతనాట్యాన్ని నర్తకి విష్ణుప్రియ అద్భుతంగా ప్రదర్శించగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. వివిధ సాంప్రదాయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మారెమ్మ దేవి సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బి. దేవరాజ్, కళాకలవరం సంస్థ సభ్యులు డాక్టర్ నాగేంద్రనాథ్, వీరభద్ర అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ సభ్యులు రామాంజనేయులు, రాంప్రసాద్, అంజన రెడ్డి, సాయినాథ్ రెడ్డి, చరణ్ కుమార్, గురిగిరెడ్డి, రవీంద్రనాథ్, వీరన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా కళాకారులను నిర్వాహకులు అభినందించారు.