జనం న్యూస్ 2026 మార్చి 15 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శనివారం మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా కౌన్సిలర్ లు, నాయకులతో కలిసి పద్మ దేవేందర్ రెడ్డి జాతరలో ఆట వస్తువులను, తినుబండారాలను కొనుగోలు చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్,పిఎసిఎస్ మాజీ చైర్మన్ బాదే చంద్రం,మున్సిపల్ కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్, చౌదరి చరిత,నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, శ్రీను, ఐలయ్య, బాలు,కిషన్, హైమద్, అస్స్నొద్దీన్, నాగార్జున,మధుకర్, సాయి,రాజు, అశోక్, రాంకీ, వెంకటేష్, నవీన్, నీలా రాజు, శ్రీకాంత్, నిఖిల్, వంశీ, ప్రశాంత్, మరియు రామాయంపేట ముదిరాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
