రానున్న ఎన్నికల్లో వాడ వాడలా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది.

జనం న్యూస్ మార్చ్ 15 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం)లో జనసేన నాయకురాలు ముయ్యబోయిన ఉమాదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా వాడ వాడల రెపరెపలాడుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సభ్యత నమోదు కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వేముల కార్తీక్ సారథ్యంలో శర వేగంగా దూసుకుపోతుందని తెలిపారు. సభ్యత్వ లక్ష సాధనకు తమ వంతు సహకారాన్ని పూర్తిస్థాయిలో అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మల పోసి, రామకృష్ణ, పమిడి ప్రసాద్, భాను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *