మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ లాంగ్వేజ్( తెలుగు) పదో తరగతి పరీక్ష.

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ

జనం న్యూస్ 2026 మార్చి 15 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ ) శనివారం హవేలీ ఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ పరిశీలించారు.పదవ తరగతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రెగ్యులర్ 11,239 విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 11,220 మంది విద్యార్థులు మాత్రమే హాజరు అయ్యారని 19 మంది విద్యార్థులు గై హాజరు. అయ్యారనితెలిపారు. 99.83%గా నమోదు అయిందన్నారు. అలాగే గతంలో పదవ తరగతిలో ‌ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులు‌ 14 మంది పరీక్ష ‌రాయాల్సి ఉండగా 09 మంది మాత్రమే హాజరయ్యారని 05 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.64.28 % గా నమోదయింధని అన్నారు. జిల్లాలో 03 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్షా కేంద్రాలను సందర్శించారని ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. విద్యార్థులు ఒక పరీక్షకు మరొక పరీక్షకు మధ్య ఉన్నటువంటి రోజులలో పాఠశాలకు విధిగా హాజరై తదుపరి పరీక్షకు సిద్ధం కావాలని, ఉపాధ్యాయుల సలహాలు పర్యవేక్షణలో ఉత్తమ మార్కుల సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు.