మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు దూర్మరణం.

జనం న్యూస్ 15/మార్చ్/2026 టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి. లక్ష్మణ. మెదక్ జిల్లా కోల్చారాం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది.బైక్ ను అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు.మృతులు హెవీలిగానాపూర్ మండలం బూరుగుపల్లి వాసులుగా తెలిసింది.