మునగనూరు లో నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

జనం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 15 మార్చి 2026 ఆదిబాట్ల సర్కిల్ పరదిలోని మునగనూరు లొ నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయం తో మునగనూరు,తొర్రూరు, రాగన్నగూడ, తుర్కయంజాల్, మన్నెగూడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వనస్థలిపురం వెళ్ళల్సిన అవసరం ఇకపై ఉండదాని తెలిపారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పనూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత ప్రాంత ప్రజలు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ కార్యాలయం ప్రారంభంతో సమయం మరియు ఖర్చు రెండూ తగ్గి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ముంగనూరు కు రాకుండ అడ్డుకుండేందుకు కొందరు కుట్రలు చేసిన పట్టుపట్టి మీకోసం మునగనూరు కు తీసుకువచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపించాలని ఎక్కడ అవినీతి అనేది లేకుండా అధికారులు పని చేయాలనీ ఎమ్మెల్యే సూచించారు…ఈ కార్యక్రమం లో రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *