మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలి

జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె బనగానపల్లె మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం మరుగుదొడ్లు నిర్మించాలి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి బనగానపల్లె గొర్రెల సంతకు అన్ని ప్రాంతాల నుంచి బనగానపల్లెకు వస్తారు ఒక్కొక్క గొర్రెకు మేకకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు అయినా అక్కడ కనీస వసతులు లేవు ఎంతో మంది స్త్రీలు పురుషులు ఈ సంతకు కొనుగోలుదారులు వస్తూ ఉంటారు సిపిఐ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వసతులు కల్పించాలి అలాగే వర్షాకాలం రాబోతుంది వ్యాపారస్తులు రైతులు కొనడానికి అమ్మడానికి ఇక్కడికి వస్తారు వర్షం వచ్చినప్పుడు వ్యాపారి తీవ్రంగా నష్టపోతున్నాడు ఒక వ్యాపారి నష్టపోతే పదిమంది గొర్రె కాపరులు నష్టపోతారు ఎందుకంటే ఆ డబ్బు చెల్లించలేడు కాబట్టి సిపిఐ గా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ రేకుల షెడ్లు నిర్మించాలని అలాగే నియోజక వర్గం లో చాలా మంది గొర్రెలు మేకలు పొట్టేలు వీటిపైనే ఆధారపడి ఉంటారు గత ప్రభుత్వాల్లో గొర్రెల లోన్లు ఇచ్చేవి ఆ స్కీం కింద 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ స్కీమ్ తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు ఆర్ అండ్ బి శాఖామంత్రి శ్రీ జనార్దన్ రెడ్డి కి గొర్రెల కాపరుల ద్వారా విజ్ఞప్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులను ఆదుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సుబ్బారెడ్డి మండల సమితి సభ్యులు శివ నాగయ్య సుబ్బయ్య నరసమ్మ రమేష్ మౌల తదితరులు పాల్గొన్నారు