జనం న్యూస్ మార్చ్ 15 (చిలుకూరు మండల) ఇటీవల అనారోగ్యానికి గురైన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శవ్వ మల్లయ్యను మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారుఅదే విధంగా గ్రామంలో రెండు రోజుల క్రితం చనిపోయిన మేము సైతం గౌరవ సలహాదారులు నాగుల్ పాషా మాతృమూర్తి షేక్ మైబుబి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పునిచ్చారు వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూర్చాలని అన్నారు ఈ సందర్భంగా మేము సైతం గౌరవ సలహాదారులు నాగుల్ పాషా మేము సైతం చేసే పనుల గురించి చర్చించారు మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జానకి రామాచార్యులు, శ్రీనివాస్,వెంకటయ్య, నరసయ్య,సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, లింగరాజు వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు