మధిరలో గ్లాకోమా అవగాహన ర్యాలీ మధిర సూపరింటెండెంట్ డా అనిల్ కుమార్

జనం న్యూస్ మధిర, మార్చి15, దోర్నాల కృష్ణ. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా మార్చి 8–14గ్లాకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మధిర పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ రోడ్ ఫ్లైఓవర్ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏరియా హాస్పిటల్ మధిర సూపరింటెండెంట్ డా. అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ మధిర ఆప్తాల్మాలజిస్టు డా. రాజశేఖర్, పిహెచ్‌సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి, సిహెచ్ఓ వెంకటేశ్వర్లు, హెచ్ఈఓ గోవింద్, సూపర్వైజర్లు సుబ్బలక్ష్మి, లంక కొండయ్య పాల్గొన్నారు.రిటైర్డ్ ఆయుష్ వైద్యులు డా. అనంతయ్య, ఆశా వర్కర్లు మరియు అంగన్‌వాడీ సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొన్నారుఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గ్లాకోమా కంటి చూపును నెమ్మదిగా దెబ్బతీసే ప్రమాదకర వ్యాధి అని తెలిపారు. ముఖ్యంగా 40 సంవత్సరాల పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఏరియా హాస్పిటల్ మధిర సంయుక్తంగా నిర్వహించారు.