ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్నా పేదలందరికీ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ డిమాండ్

జనం న్యూస్ మార్చి 15 ( మఠంపల్లి ప్రతినిధి) మఠంపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్నా పేదలకు వెంటనే నూతన పట్టాదార్ పాస్ బుక్కులు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ సందర్భంగా మఠంపల్లి మండల సిపిఎం పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ గత 60,70 సంవత్సరాలుగా మండల పరిధిలోని గ్రామాలలో వివిధ సామాజిక తరగతులకు చెందిన వందలాది మంది పేదలు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని భూమిలేని పేదలందరికీ ఆనాటి ప్రభుత్వం భూములను పంపిణీ చేసి పట్టాలు ఇవ్వడంతో ఆ భూములను పైసా పైసా కుడేసుకొని రెక్కలు ముక్కలు చేసుకుని సాగులోకి తెచ్చి ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి ఉన్నదని కానీ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో వారందరికీ నూతన పాసుబుక్కులు ఇవ్వకుండా ఆపడంతో వారు ప్రభుత్వం నుండి అందించిన రైతు బీమా రైతు బంధు బ్యాంకుల నుండి రుణాలు పొందలేకపోయారని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మన పేదలు సాగులో ఉండి సేద్యం చేసుకుంటున్న ప్రతి భూమికి పట్టాలు ఇవ్వాలని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేవరకు సేద్యం చేసుకుంటున్నా పేదలను సమీకరించి సంఘం ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు