ప్రభుత్వాలు అందిస్తున్న HPV వ్యాక్సిన్ ను ఆడబిడ్డలు అందరూ వేయించుకోవాలి -ఎచ్చర్ల ఎమ్మెల్యే

జనం న్యూస్, రణస్థలం మండలం తేది: మార్చ్ 15 రిపోర్టర్ : పొట్నూరు రామునాయుడు: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న HPV వ్యాక్సిన్ను ఆడబిడ్డలు అందరూ వేయించుకోవాలని శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు పిలుపు నిచ్చారు . ఈ రోజు రావాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారులు డాక్టర్ జనార్దన్ నాయుడు, డాక్టర్ యమున ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడబిడ్డలందరికీ ఉచితంగా అందిస్తున్న హెచ్ పీ వీ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళ ఆరోగ్యం గా ఉంటే ఇల్లు బాగుంటుంది.. అనే ఉద్దేశ్యం తో కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ అనేక సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టిందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళ అభ్యున్నతికి కృషి జరుపుతూ వికసిత్ భారత్ సాధించడానికి ముందడుగు వేస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో లంక శ్యామలరావు, లంక ప్రభాకరరావు, లంక అప్పలనాయుడు, లంక కృష్ణ, ఆనందరావు, పిన్నింటి బానోజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *