పేద ముస్లిం కుటుంబాలను సంతోషంగా ఉంచేందుకే ‘తోఫా’ పంపిణి ముస్లీం కుటుంబాలకు తోఫా పంపిణి చేసిన చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం

జనం న్యూస్ మధిర మార్చి 15, దోర్నాల కృష్ణ మధిరరంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫాను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం అన్నారు. మధిర పట్టణంలో రంజాన్ పండుగకు అవసరమయ్యే తోఫాను వైస్ చైర్మన్ కోనాధని కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,వార్డు కౌన్సిలర్లతో కలిసి చైర్మన్ సుజాత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సామినేని సుజాత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగని పేద ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని తొఫా అందిస్తుందని తెలిపారు.కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండడమే మన దేశ గొప్పతనమని,ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆమె ఆకాంక్షించారు.ఉపవాస దీక్షలు రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల్లో ఇస్తార విందులు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయని ఈద్గాలు మసీదుల ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, ప్రార్థనల సందర్భంగా తాగునీరు వంటివి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్, తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్తా,ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.