పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు

జనం న్యూస్ 15 మార్చి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 49 ఆవులు, గేదెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు. పశుపోషకులు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించి వ్యాధులు సోకకుండా కాపాడుకోవాలని వైద్యాధికారి కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు మౌలి గౌస్, పశువైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.