పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మత పెద్దలకు దుస్తులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ, బనగానపల్లె వ్యాప్తంగా ఉన్న పలు మసీదులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లిం మత పెద్దలైన మౌజామ్, ఇమామ్‌లకు దుస్తులు అందజేసి వారి ఆశీర్వాదం పొందారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం మైనార్టీ సోదరుల కోసం మంత్రి ప్రతీ ఏడాది తన సొంత నిధులతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రేపు (15వ తేదీ) నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలు మరియు మైనార్టీ సోదరులను మంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.