జనం న్యూస్ 15 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: పంటల సాగులో రైతులు మెలకువలు పాటించాలని కొమురం భీ0 అసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా శనివారం జైనూర్ మండలంలోని దుబ్బగూడలో రైతులు పండించే పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహ,సూచనలు పాటించాలని ఆయన కోరారు. రైతులు పంటలపై వేసే క్రిమిసంహారక మందులను పిచికారి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. పంటలపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు వాడవద్దని ఎరువులు కూడా తగిన మోతాదులోనే వాడాలని ఆయన కోరారు. ఈఅవగాహన సదస్సులో కార్యక్రమంలో దుబ్బ గూడ సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, ఉప సర్పంచ్ పెందూర్అనుసయబాయి, వార్డు సభ్యులు రాంభ బాయి, మడావి రాజు, జంగుబాయి, రైతులు భీంరావు, శంకర్, జుగాది రావు,రాము,ఏఈఓ లు తదితరులు పాల్గొన్నారు.