జనం న్యూస్ మార్చి15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నేడు 15న ఆదివారం రాజేంద్రపాలెంలో మెగా వైద్య శిబిరం ఈ వైద్య శిబిరం నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ గొడ్డేటి మాధవి శివ ప్రసాద్ అరకు మాజీ ఎంపీ సహకారంతో, నర్సీపట్నం శారద హాస్పిటల్ ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది.ఈ వైద్య శిబిరంలో శారద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అజయ్ స్రవంత్ బృందం వైద్య సేవలు అందించనున్నారు. అన్ని రకాల కడుపు నొప్పులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు, ప్రేగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, హెర్నియా, హైడ్రోసిల్, సంబంధిత సమస్యలు, మూత్ర కోశ సమస్యలు, కుటుంబ నియంత్రణ సమస్యలు, బిపి, షుగర్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు వైద్య సేవలు అందించబడతాయి. ప్రత్యేకంగా రొమ్ము, నోటి క్యాన్సర్లకు నిపుణులైన వైద్య బృందంతో స్క్రీనింగ్ పరీక్షలు చేయబడును. శారదా ఆసుపత్రి సిబ్బందితో షుగర్, బిపి, ఇసిజి పరీక్షలు ఉచితంగా చేయబడును. అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వబడును. రాజేంద్రపాలెం గిరిజన భవనంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుంది. శారద హాస్పిటల్ ఆధ్వర్యాన జరుగు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు