దమ్మెను గ్రామ సర్పంచ్ నిరసన

జనం న్యూస్, మార్చి 15 తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం శుక్రవారం జరిగినదమ్మెనుగ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ ప్రధమ పౌరుడు అయినా గురజర్ల సత్యనారాయణ లేకుండా నిర్వహించడంపై పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన నిరసన దీక్ష చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి ఎటువంటి సమాచారం లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ ఆరోపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణాళికలతో కూడిన పనులు గ్రామ సర్పంచ్ చేపట్టామని అన్నారు. గ్రామ సర్పంచ్ అయినా తమతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామ కార్యదర్శి పై గ్రామ సర్పంచ్ మండిపడ్డారు. పై అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలను తీసుకువెళ్లేమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానన్నఅధికారుల హామీతో ఈ నిరసన దీక్షను విరమించుకున్నానని గ్రామ సర్పంచ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *