జనం న్యూస్ 15 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలో శనివారం రోజున ట్రాఫిక్ కు అంతరాయం గా ఉన్న రోడ్డుకు ఇరువైపులా వ్యాపారవేత్తల షాపు బోర్డులను తొలగించిన స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపుల షాపుల ముందు ఉన్న బోర్డులను పరిశిలించి వాహనదారులకు, పాదచారులకు, ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న బోర్డులను తొలగించే కార్యక్రమంను చేపట్టాలని పరిశిలించిన సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది, అనంతరం షాపు వాళ్ళు స్పందించి సహకరించారు మున్సిపల్ కమిషనర్ కు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మోరీల పరిస్థితి కనబడటం లేదా కమిషనర్ కు అని సవాలు చేశారు రైల్వే గేట్ నుండి దుర్గమ్మ గుడి వరకు ఉన్న దుకాణాల ముందు మోరీల దుర్వాసన గత ఐదు సంవత్సరాల నుండి మున్సిపల్ సిబ్బంది శుబ్ర పరచడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తక్షణమే కమిషనర్ స్పందించి తగిన చర్య తీసుకోవాలని విన్నవించారు ఇట్టి కార్యక్రమంలో మేనేజర్ బి.జగన్ మోహన్, శానిటేషన్ సూపర్ వైజర్లు పి.ప్రసాద్, ఏ.శివ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు