జాతీయ లోక్ అదాలత్‌లో 407 కేసులు పరిష్కారం”

జనం న్యూస్ మార్చి 15 కోటబొమ్మాళి మండలం :కోటబొమ్మాళి కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఫుల్ అడిషనల్ చార్జ్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి ఎస్. వాణి ఆధ్వర్యంలో బెంచ్ ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 407 కేసులు పరిష్కరించబడినవి. అందులో సివిల్ కేసులు 06, క్రిమినల్ కేసులు 20, ప్లీ బార్గైనింగ్ ద్వారా రాజీ అయిన కేసులు 78, అడ్మిషన్ కేసులు 302, మనోవర్తి కేసు 01 ఉన్నాయి. ఈ కేసుల ద్వారా మొత్తం రూ. 50,08,998/- మొత్తాన్ని పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులుగా వి. అప్పలనాయుడు, బి. జీవన్ పాల్గొన్నారు. కోటబొమ్మాళి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్. శ్రీనివాసరావు, ఇతర న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.