జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

జనం న్యూస్ మార్చి 15 అడవిదేవులపల్లి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శనివారం రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొట్రా గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పార్టీ సూచనలు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా కూరాకుల శ్రీనివాస్ రావు, నరసింహరావు, సురేష్, వలిరాజు, భార్గవ్, రమేష్, సతీష్ తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కోట్రా గోవర్ధన్, కనకయ్య, భార్గవ్, అనీల్, జానీ భాష, ధనిశెట్టి శివ, పూజల వెంకటేశ్వర్లు, సిగపట్ల కోటయ్య, సురేష్, సైదా హుస్సేన్, కరుణాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.