జనం న్యూస్ మార్చి 15 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం ) మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం రోగ నిరోధక టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ గోసుల రాజేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారులకు, గర్భిణీలకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా రోగాల బారి నుండి రక్షణ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు మెంబర్ పప్పుల ఉపేందర్, ఆర్.ఎం.పి డాక్టర్ కొత్త ఉపేందర్, ఏ.ఎన్.ఎం గీత, ఆశా వర్కర్ శుక్లావతి, అంగన్‌వాడీ టీచర్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.