చిరు వ్యాపారులకు గ్యాస్ తిప్పలు

జనం న్యూస్ మునగాల మండలం – మార్చి 15 :: కందిబండ హరీష్ డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్ లో 45 రోజులు గడువు చూపెట్టడం గృహ అవసరాలకు కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళన మొదలైనది. మునగాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు,చిన్న హోటళ్లు, బండిపై అల్పాహారాలు విక్రయించే వ్యాపారులు గ్యాస్ కొరతతో రోజువారీ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడం, సమయానికి సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్న వ్యాపారుల పై అదనపు భారం పడుతోంది.గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కొరత ఉండడంతో ముందుగా బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యంగా వస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని గంటల పాటు దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో టీ, టిఫిన్ దుకాణాలకు ఎక్కువగా వినియోగం ఉండటంతో గ్యాస్ లేకపోతే వ్యాపారం పూర్తిగా నిలిచిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *