ఘనంగా జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ మార్చి 15 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య కేక్ కటింగ్ తో మొదలు పెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా తూర్పు మెట్ట గ్రామానికి చెందిన చిచ్చడి ప్రసాదు జనసేన కార్యకర్త  గత ఏడాది గుండెపోటుతో మరణించారు. అతనికి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవర్ధించి నేటికీ 13 ఏళ్ల అవుతుందని, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ తన సొంత నిధులతో పార్టీ నడిపిస్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక ప్రభంజన సృష్టించిందని 21 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలుచుకున్న ఏకైక పార్టీ జనసేన అని, పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలన్నీ కూడా ఒక సమన్వయంతో పని చేసుకుంటూ గ్రామాలలో అభివృద్ధికి పెద్దపీట వేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో సభ్యత్వం చేసుకుంటే సభ్యత్వంతో పాటుగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాచర్ల వెంకటేశ్వర్లు, వీర మహిళలు పోడియం తులసి పాలేటి శ్రీదేవి మాచర్ల లక్ష్మి జనసేన నాయకులు దేవిరెడ్డి సుధాకర్, కోడూరి నాగు, మంచర్ల సమ్మయ్య, ఎం ఏ షాను, సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రాంతికుమార్, రాయల రవికుమార్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *