
జనం న్యూస్ మార్చి 15 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోరంట్ల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి గుమ్మయ్యగారి పల్లి వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జనసేన పార్టీ జెండాలతో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం బస్టాండ్ సర్కిల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్,జిల్లా సంయుక్త కార్యదర్శి సి. వెంకటేష్, జిల్లా పోగ్రామింగ్ కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షులు సంతోష్, నియోజకవర్గం నాయకుడు అనిల్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్, వానువోలు సింగిల్ విండో డైరెక్టర్ నాగేష్, వీర మహిళలు కావేరి, శోభ, మండల నాయకులు రాఘవేంద్ర,శ్రీనివాసులు, రాజు, నాగేంద్ర, గాజుల రమేష్, తిరుపాల్, డల్లే నరేంద్ర,మొండి రామాంజి, మహేష్, పవర్ స్టార్ బాబా. బాలు, గోవిందప్ప, శంకర,రెడ్డెప్ప, సురేష్, సింగిరెడ్డి పల్లి రమేష్, మంజు,హేమంత్, గణేష్, మధు,ఉపేంద్ర, మల్లి, చరణ్, మూర్తి, జస్వంత్ ,ప్రకాష్, వికాస్,నాగభూషణ,సాయి ,వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు