జనం న్యూస్ కూడేరు మార్చి 15 రిపోర్టర్ ముంగ ప్రదీప్ మండల పరిధిలోనికొర్రకోడు గ్రామ దళిత నివాసి శనివారం బిజెపి పార్టీలోకి చేరడం జరిగినది.. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ను ఆదర్శంగా తీసుకుని,బిజెపి జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో భాజపా పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మూస నాగరాజు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులనై. బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ న్యాయకత్వంలో ఆయన పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం అహర్నిశలు పరితపిస్తున్న ఆయన న్యాయకత్వంలో బిజెపి పార్టీలోకి చేరడం జరిగిందని. ఇందుకోసం నాకు అవకాశం కల్పించిన కిసాన్ మోర్చా నాయకుడు రామాంజనేయులు మెచ్చి పార్టీలో చేరడం జరిగింది ని విలేకరులకు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు, బిజెపి మండల ఉపాధ్యక్షులు, బి నాగేంద్రతదితరులుపాల్గొన్నారు. మూస నాగరాజు గతంలో ఆ.ర్. డి.టీ టీచర్ గా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి దళిత కాలనీ ప్రజలకు పని చేయడం జరిగినది అన్నారు. బిజెపి పార్టీలో చేరిన నేను పార్టీ కోసం గ్రామ మండల నియోజకవర్గ పార్టీ నాయకులకు అందుబాటులో ఉండి పార్టీ విస్తరణ కోసం కృషి చేస్తానని త్వరలో మా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు బిజెపి పార్టీలోకి చేరుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.. బిజెపి పార్టీలో చేరిన కొర్రకోడు నాగరాజు