కంగ్టి లో పరీక్ష కేంద్రలకు సకాలంలో హాజరైనా విద్యార్థుల,

* పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, * విద్యార్థుల్లో ఉత్సాహం, భయఆందోళన,

జనం న్యూస్,మార్చ్ 15 ,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.పదవ తరగతి రాత పరీక్ష రాయడానికి వివిధ పాఠశాలల విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాల వద్ద చేరుకోవడం జరిగింది. పరీక్ష కేంద్రాలలో విధులు నిర్వహించే అధికారులు విద్యార్థుల వద్ద స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్లూటూత్,ఎయిర్ బర్డ్స్,విద్యార్థుల హాల్ టికెట్ ని,హాల్ టికెట్ పై ఉన్న ఫోటో ముఖ చిత్రాన్ని క్షుణ్ణంగా పరీక్షించి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించారు.పరీక్ష కేంద్రాల సమీపంలో స్థానిక పోలీస్ సిబ్బంది 144 సెక్షన్ ను అమలు పరిచారు.పదవ తరగతి రాత పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *