జనం న్యూస్ కూడేరు మార్చి 15 రిపోర్టర్ ముంగా ప్రదీప్ కూడేరు మండల పరిధిలోని గొటుకూరు రెవిన్యూ నందు రీ సర్వే అధికారులు భూ సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని వేగవతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల రీ సర్వే డిప్యూటీ తహశీల్దారు ప్రసాద్ సూచన మేరకు గ్రామ సర్వేయర్లు వీఆర్వో వీఆర్ఏలు గొటుకూరు ప్రాంతంలో రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ఎండను సైతం లెక్కచేయకుండా గత నెల రోజులుగా గొటుకూరు ప్రాంత భూ సర్వే కార్యక్రమాన్ని చురుకుగా సాగిస్తున్నారు. రీ సర్వే కార్యక్రమంలో రైతుల పొలాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ చేయడం కోసం మొదటిగా ఆయా ప్రాంత రైతులకు నోటీసులు, వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం తెలియజేస్తూ సమగ్ర భూ సర్వే ను నిర్వహిస్తూ ఉన్నారు. రీ సర్వే అధికారులు సర్వే నిర్వహిస్తున్న సమయంలో రైతులు తమ దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధిత ఆధారాలను చూపిస్తూ భూములు సర్వే చేయించుకోవాలని అలాగే రీ సర్వే అధికారులకు రైతుల ప్రతి ఒక్కరు సహకరించి సర్వే నంబర్ల ప్రాతిపదికన ఎవరి పొలాల్లో వారి ఉంటూ సర్వే చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కుల్లాయి స్వామి, గ్రామ సర్వేయరు సుజాతబాయి, విశాల్ , వీఆర్ఏ జ్ఞానేష్, ఓబన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.