అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి రక్తదానం – ముందుకొచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థ

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంతం నితిన్‌కు రక్తం అందించిన ప్రవీణ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు

జనం న్యూస్/ గంభీరావుపేట మార్చి 15 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన పంతం నితిన్ (24) అనారోగ్య పరిస్థితుల కారణంగా నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు అత్యవసరంగా రక్తం అవసరమని ప్రవీణ్ స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందడంతో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈరోజు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న సంస్థ సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కూడెళ్లి ప్రవీణ్ కుమార్, అంగూరు శ్రీనివాస్, మోతె శ్రీకాంత్, బండమీది తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పంతం నితిన్‌కు ఇంకా రక్తం అవసరం ఉన్నందున ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి సహాయం చేయాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కోరారు.