జనం న్యూస్ మర్చి 15 ప్రతి నిది ఎండీ జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ద్వితీయ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్ తరగతులు ఈ నెల15వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, అంబేద్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఎం. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇకపై ప్రతి ఆదివారం మరియు రెండవ శనివారం రోజుల్లో తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు.మరింత సమాచారం కోసం అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులు నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలోసంప్రదించాలని సూచించారు.