జనం న్యూస్ బద్రి 14.3.26 ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంఈఓ రవి కుమార్ అన్నారు. శుక్రవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలం మొత్తం 654 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు కారంపూడిలోని మూడు కేంద్రాలు బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ఎస్టీ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ను పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు కేటాయించింది. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు 100 మీటర్ల వరకు పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. అలాగే పరీక్ష కేంద్రాలు వద్ద పరీక్షలు మూసే అంతవరకు జిరాక్స్ షాపులు తీసివేయాలని తెలియజేశారు. ఎగ్జామ్స్ సెంటర్ కు వచ్చే ఇన్సులేటర్స్ కు మొబైల్ అనుమతి లేదు అని తెలిపారు. ప్రతి ఎగ్జామ్స్ సెంటర్ వద్ద ఉచితంగా మెడికల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.