హలో బహుజన్ – ఛలో బడంగ్ పేట్ సభను విజయవంతం చేయాలి.

జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీఎస్పీ గోడ పత్రికలను విడుదల. జిల్లా అధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్ జోగులాంబ : మానవపాడు ఈనెల 15వ తేదీన బడంగ్ పేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహుజన రాజకీయ యుద్ధభేరి సభకు సంబందించిన కరపత్రాలను శుక్రవారం మానవపాడు మండల కేంద్రంలో చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్ మాట్లాడుతూ.. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని సభ ఉంటుందన్నారు. ఈ సభకు సంబందించిన గోడపత్రికలు, కరపత్రాలను నేడు ముఖ్య నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు పార్లమెంటు, అసెంబ్లీలో ఉండాలని కాన్షీరాం 1984లో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో రాజకీయ ప్రకంపనలను సృష్టించిన కాన్షీరామ్ జయంతి సందర్భంగా బడంగ్ పేటలో ఈనెల 15న భారీ బహిరంగ సభ ఉందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, బహుజన మేధావులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు, అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, మైఖేల్, రామకృష్ణ రెడ్డి, మిర్జురు సుధాకర్, రవి, నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *