సీతారాంపురం యం పి ఎస్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవవేడుకలు

జనం న్యూస్ గుండాల మార్చి 14.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని సీతారాంపురం గ్రామ యం. పి. ఎస్. పాఠశాలలో అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవరిస్తూ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు విద్యార్డులు సర్పంచ్ డి ఈ వో. ఎం ఈ వో లుగా పాత్రలు పోషించి గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు ఈ సందర్బంగా హెడ్మాస్టర్ రామనర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని పట్టుదలతో పరీక్షలు రాసి అధిక మార్కులు తెచ్చుకోవాలని ఆయన అన్నాడు ప్రతి విద్యార్ది ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నేను ఆశిస్తున్నాను అని అన్నాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్ పాల్ అంగన్వాడీ టీచర్స్ జి. వాణి జె. నిర్మల ఆయాలు మంజుల సుశీల అటెండర్ చంద్రయ్య మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *