షాద్‌నగర్‌లో పేదలకు రంజాన్ తోఫా పంపిణీ.

సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

జనం న్యూస్ 14 మార్చ్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని మతాలకు అతీతంగా పేదలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం షాహీ గార్డెన్ పరిగి రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సామాజిక కార్యకర్త, సీనియర్ లీడర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో జరిగింది. మతాలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజలకు దాదాపు 1000 మందికి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు, పండుగకు అవసరమైన ఇతర వస్తువులను పంపిణీ చేశారు. సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో ఉన్న పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ పెన్ జాకీర్ హుస్సేన్, కాలోని యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.