జనం న్యూస్ మార్చి 14 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి గత నవంబర్లో జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్.ఎం. ఎం ఎస్ లో భూపాలపల్లి జిల్లా నుంచి 23 మంది విద్యార్థులు ఎంపికవగా అందులో 8 మంది విద్యార్థులు శివాని తన్మయి అక్షిత జుబియా అంజలి మనశ్విని స్లోహిత్ , స్నిగ్ధ లు బాలికల పాఠశాలకు చెందిన వారే కావడం గర్వించదగ్గ విషయమని ఆందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని ఉపాధ్యాయ బృందాన్ని మరియు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులు ఎంపిక కావడానికి కృషిచేసిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మడక మధుకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజేందర్ సర్పంచ్ హసీనాబాను గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు యూత్ కాంగ్రెస్ లీడర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు