జనంన్యూస్ మార్చి 14 ఎలిగేడు మండలం ఎలిగేడు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలోని నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు కార్యక్రమము ఎం పీ డి వో భాష్కర్ రావు ఆధ్వర్యములో మండల కేంద్రములో ఉన్న రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు సభ్యులు ఐదు రోజుల నుండి నుండి జరుగుతున్న శిక్షణ ద్వారా గ్రామాల వార్డు సభ్యుల విధులు బాధ్యతలు గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర ,సర్పంచ్ లతో కలిసి పని చేయాలని తెలిపారు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు శిక్షణ పొందిన సర్టిఫికెట్ లు అందజేశారు ఈ కార్యక్రమములో ఎం పీ వో కిరణ్ ,అన్ని గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు సర్పంచ్ లు ట్రైనర్లు సురేష్ ,శివ,సాగర్ ,రణధీర్ ,కార్యదర్శులు ,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
