జనం న్యూస్ 14-03-2026 రామగుండం మండలం ప్రతినిధి ప్రమోద్ కుమార్ వెంకటేష్ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం – ఏసీపీ మడత రమేష్ పదవ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామగుండం సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సలహాదారు సురేష్ సహకారంతో, రామగుండం గురుకుల పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గురుకుల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, రామగుండం ఎస్ఐ సంధ్య హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితంలో ఎంతో కీలకమైందని, ఇప్పుడే కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. పదవ తరగతి పరీక్షలను లక్ష్యంగా పెట్టుకుని శ్రద్ధగా చదివి మంచి జీపీఏ సాధించాలని సూచించారు. చదువుకున్న వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులకు ఎల్లప్పుడూ తమవంతు సహకారం ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎస్వీపీ రజిత, జేవీపీ రజిత, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉషారాణి మురళి, ప్రధాన కార్యదర్శి కె. భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ మాధవి, కోశాధికారి బాదె అంజలి, కార్యదర్శులు సంధ్యారాణి, రజిత, పేరెంట్స్ కమిటీ నాయకులు నవీన, శైలజ, కళ్యాణి, జ్యోతి, పేరెంట్స్ కమిటీ జిల్లా నాయకులు సంపత్, సతీష్, ఉపాధ్యాయులు తేజశ్విని, నర్మద, రజిత, సునీత, సమత, మానస, శ్రీదేవి, శ్రీలత, హెచ్ఎస్ మేడమ్తో పాటు కళాశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.