జనం న్యూస్ మార్చి 14 పుల్లంపేట పుల్లంపేట మండలంలో పుత్తన వారిపల్లి దగ్గర ఉన్నఏ.పీ మోడల్ స్కూలు ప్రిన్సిపల్ లీలా శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన జరిగిన 13వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ముఖ్య అతిథులుగాపాల్గొన్నఎం.పీ.డీవో జయశ్రీ మాట్లాడుతూ ఈనాటి విద్యార్థులే రేపటిదేశభవిష్యత్తుకు పునాదులు వేయాలని, క్రమశిక్షణతో మంచి విద్యను అభ్యసించిమంచి అలవాట్లను నేర్చుకోవాలనితెలియజేశారు.మండల టిడిపి అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఆన్యువల్ లీవ్స్ అంటే ప్రతి విద్యార్థికి ఆనందంగా ఉంటుందని, సెలవుల్లో ప్రతిరోజు కొంత సమయం చదువుకు కేటాయించి పై తరగతికి వెళ్లేవాళ్లు అడ్వాన్సుగా ప్రిపేర్ అయ్యి మీరు వెళ్లే తరగతిలో కూడా మంచి మార్కులు సంపాదించి,మీ స్కూలుకు, ప్రిన్సిపాల్ కు,ఉపాధ్యాయులకు, మీయొక్కతల్లిదండ్రులకుమంచి పేరు తేవాలని కోరారు.ఎం.ఈ.ఓ, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మీరు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చి కేవలం ఒక కోర్స్ మీదనే ఆధారపడకుండా వివిధ కోర్సులు ఎంచుకొని అన్ని రంగాల్లో రాణించి మన స్కూలుకే కాకుండా మన మన రాష్ట్రానికే గర్వకారణంగా నిలువాలి అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిన్న రెడ్డప్ప మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి బహుమతులు తీసుకునే స్థాయినుంచి బహుమతులు ఇచ్చే స్థాయి వరకు ఎదగాలని అలాగే స్కూలు వదిలిన వెంటనే ఇంటికి వెళ్లేటప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ క్రమశిక్షణగా ఇంటికి వెళ్లాలని సూచించారు. అనంతరం అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ 2 నాగ తిరుమలరావు, ప్రిన్సిపాల్ లీలా శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, పుల్లంపేట ఎస్సై వారి సిబ్బంది ఉపాధ్యాయ బృందం బృందం పాల్గొన్నారు.