మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన డబోలి గ్రామపంచాయతీ వివిధ పార్టీ నాయకులు.

కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.

జనం న్యూస్ 14 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.జైనూర్: జైనూర్ మండలం డబోలి గ్రామ పంచాయతీ పరిధిలోని గరైన్ గూడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ పటేళ్లు, వార్డు సభ్యులు, పలు పార్టీలకు చెందిన ముఖ్య కార్యకర్తలు మరియు మహిళలకు సుగుణక్క కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే సుగుణక్క నాయకత్వం నచ్చి పార్టీలో చేరుతున్నామని పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు: మెస్రం మక్కు (మాజీ ఎంపీటీసీ ), మెస్రం మారుతి (గ్రామ పటేల్), షేక్ ముబారక్, కే. బాపూజీ (వార్డు మెంబర్), విమల బాయి (వార్డు మెంబర్), యాదవ్ రావ్, (వార్డు మెంబర్), ఏ. రాము పటేల్, టి. దేవ్ షా, లింగు, పెందోర్ జ్ఞానేశ్వర్, ధర్ము, శంభు, వసంత్ రావ్, చిన్ను, జంగు, పైకు, మక్కు, పి. భీమ్ రావ్, మెస్రం జంగు, మెస్రం నాగు, రాము, మాణిక్ రావ్, రాజు, కే. రామచందర్, కే. మోతీరాం, కే. భీమ్రావు, సీతారాం, సోనేరావు, లచ్చు, భుజంగరావు, ప్రకాష్, షేక్ తాజ్, కే. రాజు, జి. రాజు, మహేష్, హీరామన్, కే. నాగు, ఎం. తనాజీ, ఎం. సోనేరావు, పి. మోహపత్, జ్ఞానేశ్వర్, అనుసయా బాయి. కార్యక్రమంలో పల్గిన్నవారు.. మండల అధ్యక్షుడు ముఖిద్,ముబారక్, మెస్రం మక్కు (మాజీ ఎంపీటీసీ), మెస్రం జంగు, సోయం రాంషా, రషీద్ (మాజీ ఎంపీటీసీ ), మెస్రం మోతీరాం, మెస్రం సీతారామ్, మెస్రాం బోజ్జు పటేల్ (మాజీ ఎంపీటీసీ ), కోటేష్ తదితరులు ఉన్నారు. డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *