ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

జనం న్యూస్ మునగాల మండలం మార్చి – 14 కందిబండ హరీష్. : గత ఐదు రోజులుగా మునగాల మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది.ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం పెంపొందించుకుని పారదర్శకంగా పని చేయాలని సభ్యులకు సూచించారు.అనంతరం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నరేష్, రిసోర్స్ పర్సన్స్ మరియు 11 గ్రామ పంచాయతీల వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *