మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా పూల మాలలతో విశేషాలంకరణ చేశారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలిత విగ్నేశ్వరుని పూజ,అమ్మ వారికి అభిషేకం మరియు శ్రీ సూక్త విధానంగా సహస్రనామ కుంకుమార్చన,ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నీరాజనం మంత్రపుష్పాలు,వేద స్వస్తి జరిపారు.ఈ సందర్భంగా మహిళలచే సామూహికంగా లలితా సహస్ర పారాయణo చేశారు. అలాగే ఆలయ ఆవరణలో గల వినాయకుడు, షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదుల శ్రీనివాస్,కోట ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మ వారికి జరిగిన పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆణివిళ్ళ సాయిబాబా,ఆణివిళ్ళ రామకృష్ణ పరమహంస, గ్రంధి నానాజీ, ఆణివిళ్ళ పవన్,వేదుల శ్రీను,ఆకొండి శ్రీకాంత్,తాతపూడి పండు, సంసాని పాండురంగా రావు, విత్తనాల నరసింహా రావు, సానబోయిన సూరిబాబు,సంసాని వర ప్రసాద్,చెరుకు బాపిరాజు, సంసాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఆలయం చుట్టూ 11 ప్రదక్షణాలతో అమ్మవారికి ధూప సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *