బుద్ధిజంలో ఘనంగా వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన బీఎస్పీ నాయకులు

జనం న్యూస్ , మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ కరీంనగర్‌లోని కెఎస్ఎల్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం బుద్ధిజం పద్ధతిలో ఘనంగా వివాహ వేడుక నిర్వహించారు. సీనియర్ బీఎస్పీ నాయకులు, నాలుగు పార్లమెంట్ చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రాంచంద్రం సోదరుడు డాక్టర్ శ్రీనివాస్ – ప్రియాంకల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహనీయుల ఆశయాలను పాటిస్తూ బుద్ధిజం పద్ధతిలో వివాహం నిర్వహించడం అభినందనీయమని బీఎస్పీ నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకుడు డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల వల్ల తమ సోదరుడు డాక్టర్ స్థాయికి ఎదిగారని అన్నారు. అదే స్పూర్తితో ఆయన వివాహాన్ని బుద్ధిజం పద్ధతిలో నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అందరూ మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.వివాహ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఎస్పీ నాయకులతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సురేష్ ఆర్య, బీఎస్పీ కేంద్ర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తదితరులు హాజరయ్యారు. వారు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) సీనియర్ బీఎస్పీ నాయకులు సురేష్ ఆర్య, చంద్రశేఖర్ ముదిరాజ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు మారపల్లి మొగిలయ్య, హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి గరిక చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.