జనం న్యూస్ మార్చ్ 14 (మండల్ లింగంపేట్) జిల్లా కామారెడ్డి. రిపోర్టర్ రవీందర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగంపేటలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాన్ని లింగంపేట్ గ్రామ సర్పంచ్ కౌడ రవీందర్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది మరియు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ పర్యవేక్షించారు ఈ కార్యక్రమం గురించి సిబ్బందికి సలహాలు అందించడం జరిగింది మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యానికి వచ్చి వారికి తప్పకుండా చికిత్స అందజేయాలని నార్మల్ డెలివరీ పెంచాలని సిబ్బంది సమయపాలన పాటించాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ హిమబిందు ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్ ఏపిఎం వినోద్ డివిజన్ సిహెచ్ఓ ఠాగూర్ సిబ్బంది పాల్గొన్నారు